చౌదరి గారిపై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వందల ఎకరాల భూములు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. చౌదరి గారు కొత్త రాజధానిలో భూములు కొన్నారని, అమరావతికి సంబంధించిన అంతర్గత వ్యవహారం పూర్తిగా ఆయన వద్ద ఉందని రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యర్ధుల ఆరోపణలు అన్నీ అవాస్తవాలే. చౌదరి గారికి రాజధాని అమరావతిలో సెంటు భూమి కూడా లేదు. అమరావతి రాజధాని ప్రాంతం కాకుండా పరిసర 29 గ్రామాలలో చౌదరి గారికి గానీ, ఆయన కుటుంబానికి గానీ, ఆయన బంధువులకు గానీ ఎటువంటి భూములు లేవు.
చౌదరి గారి పూర్వీకులు కృష్ణా జిల్లాకు చెందినవారు, ఆయన పూర్వికుల కుటుంబానికి, ఆయన బంధువులకు కొన్ని వారసత్వ భూములు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అయితే అవి రాజధాని ప్రాంతం అయినా అమరావతి, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 1910 నుంచి 2010 మద్య కాలం వరకు ఉన్న పూర్వీకుల భూములను కృష్ణా జిల్లాలో చౌదరి గారి కుటుంబం స్వాధీనం చేసుకుంది.
ప్రత్యర్ధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చౌదరి గారి పేరుకు కళంకం అంటగట్టేందుకు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు అమరావతి భూములను తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవటమే ఈ తాజా ఉదాహరణ.
అందుకే చౌదరి గారు తనపై ఆరోపణలు చేసే ప్రత్యర్ధులకు సవాలు విసిరారు. అమరావతిలో తన పేరున భూములు ఉన్నట్టు ఎవరైనా ఆధారాలతో రావాలని పలుసార్లు సవాలు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రత్యర్ధులు ఒక్కరూ సవాలు స్వీకరించకపోవటం చౌదరి గారి నిజాయితీకి, నిబద్దతకు నిదర్శనం.
The recent allegation that Shri Chowdary or his family acquired lands in Amaravati, the new capital of Andhra Pradesh, is nothing but calumny.